Thursday, 9 July 2015


బాహుబ‌లి రివ్యూ



బాహుబ‌లి ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుంది? అని ప్ర‌భాస్ అభిమానులు, ఆ మాట‌కొస్తే తెలుగు సినీ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణ‌మిది. మ‌రి కొద్ది గంట‌ల్లో బాహుబలి రిజ‌ల్ట్ తెలిసిపోనుంది. ఈలోగా.... ఓ బాంబు పేలింది. యూ ఏ ఈలో ఈసినిమా చూసిన ఓ సినీ జ‌ర్న‌లిస్టు బాహుబ‌లిపై రివ్యూ ఇచ్చేసింది. కైరా సాంథు( https://twitter.com/kiaarasandhu) అనే ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు, క‌మ్‌... యు ఏ ఈ సెన్సార్ బోర్డు స‌భ్యురాలు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో బాహుబ‌లి దుమ్ము దులిపింది. ఇది సినిమానా?? అన్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చేసిన సంచ‌ల‌న కామెంట్లు ఇలా ఉన్నాయి

* ప్ర‌భాస్‌, రానాల‌కు మ‌హేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు ఉన్నంత స్టామినా లేదు.

* బాహుబ‌లి ఓ డిజాస్ట‌ర్ ... ఈ సినిమాకి రెండు స్టార్లు ఇవ్వ‌డమే ఎక్కువ‌.

* ఆడియ‌న్స్‌ని ఫూల్ చేయ‌డం ఎలా అనేదానికి ఈ సినిమా ఓ ఉదాహ‌ర‌ణ‌. ఇది ఇండ‌య‌న్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ అంటున్నారుగానీ.. అంత లేదు. ఈ సినిమాల‌తో ఉన్న కంటెంట్ జీరో


* ఈ సినిమాని ఐమాక్స్ బిగ్ స్ర్కీన్‌లో చూడాల‌న్న ఆలోచ‌న ఉంటే విర‌మించుకోండి. ఓ ఫేక్ ఫిల్మ్ కోసం మీ డ‌బ్బులు వృధా చేసుకోవ‌ద్దు.

* ఈ సినిమా చూసిన యు ఏ ఈ డిస్ట్యుబ్యూట‌ర్లంతా త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు. మెరిసేద‌ల్లా బంగారం కాద‌ని తెలుసుకొన్నారు.

- ఇదీ ఆవిడ ఇచ్చిన తీర్పు. ఈ కామెంట్లు ఇప్పుడు ఆన్ లైన్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఇలా స్పందించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి ఈ మాట‌లెంత వ‌ర‌కూ నిజం అవుతాయో చూడాలి.

0 comments:

Post a Comment